నిను స్తుతించినా చాలు

Ninu Stutincina Calu

28 Oct 2025
నిను స్తుతించినా చాలు నా బ్రతుకు దినములో నిను పొగిడినా చాలు నా గుండె గుడిలో || 2 || ఉన్నా లేకున్నా నా స్థితి గతులే మారినా నీ సన్నిధిలో… నీ సన్నిధిలో ఆనందించే భాగ్యమున్నా చాలు ||నిను|| స్తుతులకు పాత్రుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా || 2 || నీవేనయ్యా నాకు నీవేనయ్యా || 2 || ||నిను|| ప్రేమా స్వరూపుడవు నీవేనయ్యా స్తోత్రార్హుడవు నీవేనయ్యా || 2 || నీవేనయ్యా నాకు నీవేనయ్యా || 2 || ||నిను|| ఆరాధ్య దైవము నీవేనయ్యా ఆశ్చర్యకరుడవు నీవేనయ్యా || 2 || నీవేనయ్యా నాకు నీవేనయ్యా || 2 || ||నిను|| ఆదిసంభూతుడవు నీవేనయ్యా ఆదరించు దేవుడవు నీవేనయ్యా || 2 || నీవేనయ్యా నాకు నీవేనయ్యా || 2 || ||నిను||