నిబంధనా జనులం

Nibandhana Janulam

K Rajababu 28 Oct 2025
నిబంధనా జనులం నిరీక్షణా ధనులం ఘనుడగు యేసుని సిలువ రక్తపు సంబంధులం మేము నిబంధనల జనులం యేసు రాజు వచ్చును – ఇంకా కొంత కాలమే మోక్షమందు చేరెదము || 2 || ||నిబంధనా|| అబ్రాహాము నీతికి వారసులం ఐగుప్తు దాటిన అనేకులం || 2 || మోషే బడిలో బాలురము || 2 || యేసయ్య ఒడిలో కృతాజ్ఞులం – ప్రియ పుత్రులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| విశ్వాసమే మా వేదాంతం నిరీక్షణే మా సిద్ధాంతం || 2 || వాక్యమే మా ఆహారం || 2 || ప్రార్ధనే వ్యాయామం – అనుదినము మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| అశేష ప్రజలలో ఆస్తికులం అక్షయుడేసుని ముద్రికులం || 2 || పునరుత్తానుని పత్రికలం || 2 || పరిశుద్ధాత్ముని గోత్రికులం – యాత్రికులం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| నజరేయుని ప్రేమ పొలిమేరలో సహించుటే మా ఘన నియమం || 2 || క్షమించుటే ఇల మా న్యాయం || 2 || భరించుటే మా సౌభాగ్యం – అదే పరమార్ధం మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| క్రీస్తేసే మా భక్తికి పునాది పునరుత్తానుడే ముక్తికి వారధి || 2 || పరిశుద్ధాత్ముడే మా రథ సారథి || 2 || ప్రభు యేసే మా ప్రధాన కాపరి – బహు నేర్పరి మేము నిబంధనా జనులం ||యేసు రాజు|| ఎవరీ యేసుని అడిగేవో ఎవరోలే యని వెళ్ళేవో || 2 || యేసే మార్గం యేసే జీవం || 2 || యేసే సత్యం కాదు చోద్యం – ఇదే మా సాక్ష్యం నిబంధనా జనులం ||యేసు రాజు||