నిరంతరం నీతోనే జీవించాలనే
Nirantaram Nitone Jivincalane
Hosanna Ministries
28 Oct 2025
నిరంతరం నీతోనే జీవించాలనే
ఆశ నన్నిల బ్రతికించుచున్నది || 2 ||
నా ప్రాణేశ్వరా యేసయ్యా
నా సర్వస్వమా యేసయ్యా ||నిరంతరం||
చీకటిలో నేనున్నప్పుడు
నీ వెలుగు నాపై ఉదయించెను || 2 ||
నీలోనే నేను వెలగాలని
నీ మహిమ నాలో నిలవాలని || 2 ||
పరిశుద్ధాత్మ అభిషేకముతో
నన్ను నింపుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
నీ రూపము నేను కోల్పయినా
నీ రక్తముతో కడిగితివి || 2 ||
నీతోనే నేను నడవాలని
నీ వలెనే నేను మారాలని || 2 ||
పరిశుద్ధాత్మ వరములతో
అలంకరించుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||
తొలకరి వర్షపు జల్లులలో
నీ పొలములోని నాటితివి || 2 ||
నీలోనే చిగురించాలని
నీలోనే పుష్పించాలని || 2 ||
పరిశుద్ధాత్మ వర్షముతో
సిద్ధపరచుచున్నావు నీ రాకడకై ||నిరంతరం||