ఆయనే నా సంగీతము

Ayane Na Sangitamu

Andhra Kraisthava Keerthanalu 23 Nov 2025
ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే || 2 || వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే || 2 || ||ఆయనే|| ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన || 2 || ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము || 2 || ||ఆయనే|| సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము || 2 || రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము || 2 || ||ఆయనే||