ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార

Pranesvara Prabhu Daivakumara

10 Nov 2025
ప్రాణేశ్వర – ప్రభు దైవకుమార ప్రణుతింతును నిన్నే- ఆశతీర ||ప్రాణేశ్వర|| నా ఆత్మతో పాటలు పాడ – నీ కృపలే నాకు హేతువులాయె || 2 || నిత్య నిబంధన నీతో చేసి – నీ పాద సన్నిధి చేరియున్నానే || 2 || ||ప్రాణేశ్వర|| మూలరాయి నీవైయుండగా – అపొస్తలుల పునాది మీద || 2 || నిత్య నివాసముగా కట్టబడుటకై – ఆత్మాభిషేకము అనుగ్రహించితివి || 2 || ||ప్రాణేశ్వర|| పిడుగులు విసిరే మెరుపుల వంటి – శత్రువులు నాకు ఎదురై నిల్చిన || 2 || నాకు విరోధముగా రూపించిన ఏ – ఆయుధము వర్ధిల్లలేదు || 2 || ||ప్రాణేశ్వర|| నా ఊటలన్నియు నీ యందేనని – వాద్యము వాయించి పాడెదను || 2 || జీవిత కాలమంతా నిన్నే స్తుతించి – సాగెద నూతన యెరూషలేము || 2 || ||ప్రాణేశ్వర|| కమనీయమైన నీ దర్శనము – కలనైనను మెలకువనైన || 2 || కనబడినా నా ఆశలు తీరవే – కనిపెట్టుచుంటిని కడబూరధ్వనికి || 2 || ||ప్రాణేశ్వర||