భయము చెందకు భక్తుడా
Bhayamu Cendaku Bhaktuda
11 Nov 2025
భయము చెందకు భక్తుడా
ఈ మాయ లోక ఛాయలు చూచినప్పుడు || 2 ||
భయము చెందకు నీవు
దిగులు చెందకు నీవు || 2 ||
జీవమిచ్చిన యెహొవున్నాడు
ఓ భక్తుడా.. ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు ||భయము||
బబులోను దేశమందున
ఆ భక్తులు ముగ్గురు.. బొమ్మకు మ్రొక్కనందునా || 2 ||
పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే || 2 ||
నాల్గవ వాడు ఉండలేదా
ఓ భక్తుడా.. నాల్గవ వాడు ఉండలేదా ||భయము||
చెరసాలలో వేసినా
తన దేహమంతా.. గాయాలతో నిండినా || 2 ||
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ || 2 ||
భూకంపం కలుగ లేదా
ఆ భక్తులు ముగ్గురు.. చెరనుండి విడుదల కాలేదా ||భయము||
ఆస్తి అంతా పోయినా
తన దేహమంతా.. కురుపులతో నిండినా || 2 ||
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె || 2 ||
అని యోబు పలుక లేదా
ఓ భక్తుడా.. అని యోబు పలుక లేదా ||భయము||