ప్రేమకే స్వాగతం
Premake Svagatam
17 Nov 2025
ప్రేమకే స్వాగతం పరమాత్మకే స్వాగతం
మహిమ కాంతి సుగుణాల శాంతి
నా యేసుకే స్వాగతం నా ప్రియునికే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం ||
కరుణకే స్వాగతం కరుణాత్మాకే స్వాగతం
కరుణ అరుణాల కోటి వర్ణాల నీతికే స్వాగతం
నా రాజుకే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం ||
సమతకే స్వాగతం నిజ మమతకే స్వాగతం
సకల భాగ్యల సప్త నేత్రాల స్వామికే స్వాగతం
నీ ప్రేమకే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం ||
క్రీస్తుకే స్వాగతం నా యేసుకే స్వాగతం
సత్య మార్గాల జీవ వాక్యాల కర్తకే స్వాగతం
నా జ్ఞానికే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం ||
అగ్నికే స్వాగతం దైవాగ్ని కే స్వాగతం
పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం
ఘన కీర్తికే స్వాగతం || 2 || || ప్రేమకే స్వాగతం ||