అమూల్య రక్తము ద్వారా

Amulya Raktamu Dvara

Zion 27 Nov 2025
అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా సర్వ శక్తుని ప్రజలారా పరిశుద్ధులారా పాడెదము ఘనత మహిమ స్తుతులను పరిశుద్ధులారా పాడెదము మన యవ్వన జీవితములు – శరీరాశకు లోబరచి || 2 || చెడు మాటలను పలుకుచు – శాంతి లేక యుంటిమిగా || 2 || ||అమూల్య|| చెడు మార్గమున పోతిమి – దాని యంతము మరణము || 2 || నరక శిక్షకు లోబడుచు – పాపపు ధనము పొందితిమి || 2 || ||అమూల్య|| నిత్య సత్య దేవుని – నామమున మొరలిడక || 2 || స్వంత నీతి తోడనే – దేవుని రాజ్యము కోరితిమి || 2 || ||అమూల్య|| కనికరముగల దేవుడు – మానవరూపము దాల్చెను || 2 || ప్రాణము సిలువను బలిజేసి – మనల విమోచించెను || 2 || ||అమూల్య|| తన రక్త ధారలలో – మన పాపములను కడిగి || 2 || మన కన్నులను తెరచి – మనల నింపెను జ్ఞానముతో || 2 || ||అమూల్య|| పాపులమైన మన మీద – తన యాశ్చర్య ఘన ప్రేమ || 2 || కుమ్మరించెను మన ప్రభువు – కృతజ్ఞత చెల్లింతుము || 2 || ||అమూల్య|| మన రక్షకుని స్తుతించెదము – మనలను జేసెను ధన్యులుగా || 2 || మన దేవుని కర్పించెదము – జీవాత్మ శరీరములను || 2 || ||అమూల్య||