దేవ సంస్తుతి చేయవే మనసా
Deva Sanstuti Ceyave Manasa
Mungamoori Devadasu Garu
16 Nov 2025
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా – జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా – నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు – జేసిన మేళ్ళన్ మరువకు || 2 ||
నీవు చేసిన పాతకంబులను – మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును – ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను – లేవనెత్తి దయను గృపను || 2 ||
జీవ కిరీటముగ వేయును – నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును – ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు – యవ్వనంబు వలెనే క్రొత్త || 2 ||
యవ్వనంబై వెలయునట్లుగా – మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా – ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును – బాధితులకు న్యాయ మిచ్చున్ || 2 ||
విభుండు మార్గము తెలిపె మోషేకు – దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు – ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు || 2 ||
నిత్యము వ్యాజ్యంబు చేయడు – ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు – ఆ కారణముచే ||దేవ||
పామరుల మని ప్రత్యుపకార – ప్రతి ఫలంబుల్ పంపలేదు || 2 ||
భూమి కన్న నాకాసంబున్న – ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున – ఆ కారణముచే ||దేవ||
పడమటికి తూర్పెంత ఎడమో – పాపములను మనకు నంత || 2 ||
ఎడము కలుగజేసియున్నాడు – మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు – ఆ కారణముచే ||దేవ||
కొడుకులపై తండ్రి జాలి – పడు విధముగా భక్తిపరుల || 2 ||
యెడల జాలి పడును దేవుండు – తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు – ఆ కారణముచే ||దేవ||
మనము నిర్మితమయిన రీతి – తనకు దెలిసియున్న సంగతి || 2 ||
మనము మంటి వారమంచును – జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును – ఆ కారణముచే ||దేవ||
పూసి గాలి వీవ నెగిరి – పోయి బసను దెలియని వన || 2 ||
వాస పుష్పము వలెనె నరుడుండు – నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు – ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ – భక్తితో గైకొను జనులకు || 2 ||
నిరతమును గృప నిలిచి యుండును – యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును – ఆ కారణముచే ||దేవ||