ఓ వినుము సోదర

O Vinumu Sodara

17 Nov 2025
ఓ వినుము సోదర పరమ గురుని బోధ -నమ్మిన తొలగు నరక బాధ || 2 || కులమత భేదములెందుకు మానవులెల్ల పాపులండి || 2 || జగమునందు ఎందెందు వెదకినా నీతిపరుడు లేడు -దేవుని వెదకు వారు లేరు || 2 || || ఓ .... వినుము || పాపులకెల్లను దొరికెడి జీతము నరకము సుమ్మండి .. || 2 || ఎంత ఘనులకైనా ఆ నరకము తప్పదు నిజమండి -నరకపు బాధ గొప్పదండి || 2 || || ఓ .... వినుము || నరకమనగా పూదోట కాదది అగ్నిగుండమండి...|| 2 || అగ్నిఆరదు కాలెడివారికి చావు రాదు సుమ్మి -విడుదల పొందలేరు అండి || 2 || || ఓ .... వినుము || ఏమి చేసి ఆ నరక బాధ తప్పించు కొందురండి || 2 || వ్రతములు మతములు కర్మకాండలు వ్యర్ధము సుమ్మండి -పాపము బాపలేవు అండి || 2 || || ఓ .... వినుము || ఆదిదేవుడే మిమ్మునెల్ల తప్పించనెంచినాడు .. || 2 || రెండు వేయిల ఏండ్ల క్రింద అవతారమెత్తినాడు-నరుడై తాను పుట్టినాడు || 2 || || ఓ .... వినుము || ఆకాశమందున సూర్యుని వలెనె దేవుడొక్కడండీ || 2 || నరుడై పుట్టిన దేవుని నామము యేసు స్వామి సుమ్మి -వెలుపల వెదకి దండగండి || 2 || || ఓ .... వినుము || యెల్ల వ్యాధులను చిటికలోన ఏసన్న బాగుచేసే || 2 || కుంటిని గుడ్డిని మూగవారల ముట్టి బాగుచేసే -చచ్చిన వారి కూడా లేపే || 2 || || ఓ .... వినుము || పాపము బాపను జగతిలోనాకధికారమున్నదనెను || 2 || పాపాత్ముల పాపముబాపి క్రొత్త బుధ్దినిచ్చే -వారిని మంచివారిచేసే || 2 || || ఓ .... వినుము || నరులను మోక్షము చేర్చే మార్గము నేనే అనినాడు || 2 || నేను గాక వేరొకరు ముక్తిని ఇవ్వజాలరనెను -నేనే శాంతినిత్తుననెను || 2 || || ఓ .... వినుము || యేసుని బోధకు నీచులు పటపట పండ్లు కొరికినారు || 2 || గురుని బోధను చెవిని పెట్టక కక్షబూనినారు -స్వామిని చంప వెదకినారు || 2 || || ఓ .... వినుము || ఎంతవారికైనా ననుజంపను సాధ్యముకాదనెను .. || 2 || నరులకు నరకము బాపను నేనే ప్రాణమిత్తుననెను -చచ్చి తిరిగిలేతుననెను || 2 || || ఓ .... వినుము || ప్రేమ చూపు స్వామిని దుష్టులు బందించివేసిరయ్యో .. || 2 || ఇనుప కొక్కెముల చేర్మకోలలు చేతపట్టినారు -వాటితో గురుని కొట్టిరయ్యో|| 2 || || ఓ .... వినుము || గురుని మోముపై పిడికిలితో పల్గుద్దిరి జనులయ్యో .. || 2 || మొఖముపైన వెండ్రుకలు పెరికిరి నెత్తురుబిగిచిందే -మొఖమున ఉమ్మివేసిరయ్యో|| 2 || || ఓ .... వినుము || ఇనుపముళ్ళ కీరీటమల్లి ఆ జాలిలేని జనులు ..|| 2 || గురుని శిరముపై పెట్టి కొట్టిరి -గురుడు తల్లడిల్లే జివ్వున రక్తమోదిగి కారే || 2 || || ఓ .... వినుము || పరమ గురుని ఒక తరకు కొయ్యపై పండబెట్టినారు ..|| 2 || కాళ్లలోన చేతులలో మేకులు గ్రక్కున దిగగొట్టి- మరి వ్రేలాడదీసిరయ్యో|| 2 || || ఓ .... వినుము || అంతట యేసు స్వామి బాధతో అరచి కేకపెట్టి .. || 2 || నీకు బదులుగా అయ్యలారా యేసయ్య మరణమాయె -అధిగని భూమి దద్దరిల్లే || 2 || || ఓ .... వినుము || పాపమెరుగని యేసు స్వామిని పాప నరులమూక . .|| 2 || చిత్రహింసలు పెట్టి ప్రక్కన ఈటె పొడిచిరయ్యో -నెత్తురు నీరు కలిసి పారే || 2 || || ఓ .... వినుము || యేసు స్వామి సామాధిలోపల మూడుదినములుండె ...|| 2 || చావు గెలచుతాజెప్పినట్టు బల్మహిమతోడ లేచే -స్వర్గపు తలపు యేసు తెరచే || 2 || || ఓ .... వినుము || దిగులికేల ఓయమ్మలార ఏసన్న దరికి చేరి .. || 2 || పాపము బాపుము గురుడాయనని పాపమెల్ల బాపు నిన్ను మోక్ష పురము చేర్చు || 2 || || ఓ .... వినుము ||