నీ వాక్యమే నన్ను బ్రతికించెను
Ni Vakyame Nannu Bratikincenu
28 Oct 2025
నీ వాక్యమే నన్ను బ్రతికించెను
బాధలలో నెమ్మదినిచ్చెను || 2 ||
కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా
వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా || 2 || ||నీ వాక్యమే||
జిగటగల ఊభినుండి లేవనెత్తెను
సమతలమగు భూమిపై నన్ను నిలిపెను || 2 ||
నా పాదములకు దీపమాయెను || 2 ||
సత్యమైన మార్గములో నడుపుచుండెను || 2 || ||నీ వాక్యమే||
శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై
యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది || 2 ||
అపవాది వేయుచున్న అగ్ని బాణములను || 2 ||
ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పి వేయుచున్నది || 2 || ||నీ వాక్యమే||
పాలవంటిది జుంటి తేనె వంటిది
నా జిహ్వకు మహా మధురమైనది || 2 ||
మేలిమి బంగారు కన్న మిన్న అయినది || 2 ||
రత్న రాసులకన్నా కోరతగినది || 2 || ||నీ వాక్యమే||