స్తోత్రం చెల్లింతుము

Stotram Cellintumu

Andhra Kraisthava Keerthanalu 15 Nov 2025
స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసు నాథుని మేలులు తలంచి ||స్తోత్రం|| దివారాత్రములు కంటిపాపవలె కాచి || 2 || దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి || 2 || ||స్తోత్రం|| గాడాంధకారములో కన్నీటి లోయలలో || 2 || కృశించి పోనీయక కృపలతో బలపరచితివి || 2 || ||స్తోత్రం|| సజీవ యాగముగా మా శరీరము సమర్పించి || 2 || సంపూర్ణ సిద్దినొంద శుద్ధాత్మను నొసగితివి || 2 || ||స్తోత్రం|| సీయోను మార్గములో పలుశోధనలు రాగా || 2 || సాతాన్ని జయించుటకు విశ్వాసము నిచ్చితివి || 2 || ||స్తోత్రం|| సిలువను మోసుకొని సువార్తను చేపట్టి || 2 || యేసుని వెంబడింప ఎంత భాగ్యము నిచ్చితివి || 2 || ||స్తోత్రం|| పాడెద హల్లెలూయా మరనాత హల్లెలూయా || 2 || సద పాడెద హల్లెలూయా ప్రభుయేసుకే హల్లెలూయా || 2 || ||స్తోత్రం||