ఇంత కాలం నీదు

Inta Kalam Nidu

Shubhanath Thaadi 28 Oct 2025
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా || 2 || ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా || 2 || ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా || 2 || మారని వీడని ప్రేమే నీదయ్యా మార్చిన నా జీవితం నీకే యేసయ్యా || 2 || ||ఇంత కాలం|| నీవు చేసిన మేలులు – తలచుకుందును అనుదినం || 2 || నా స్తుతి స్తోత్రము నీకే యేసయ్యా వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా || 2 || ||ఇంత కాలం|| దూరమైతిరి ఆప్తులు – విడచిపోతిరి నా హితులు || 2 || శోధన వేదన తీర్చిన యేసయ్యా తల్లిలా తండ్రిలా కాచిన యేసయ్యా || 2 || ||ఇంత కాలం||