ఓ నావికా.. ఓ నావికా
O Navika O Navika
Joshua Shaik
28 Oct 2025
ఓ నావికా.. ఓ నావికా..
ఓ నావికా.. యేసు సామి ఊసు వినవా..
ఓ నావికా…. ఓ నావికా….
శ్రమలలో శ్రామికా… || 2 ||
ఊసు వింటివా వింత గంటివా
యేసు సామి ఊసు నీవు వింటివా || 2 ||
హైలెస్సో హైలెస్సా
హైలెస్సో హైలెస్సా || 2 ||
వలేసావు రాతిరంతా
ధార పోసావు కష్టమంతా || 2 ||
చిక్కలేదు చేప ఒక్కటైనా
దక్కలేదు ఫలము కొంతైనా || 2 ||
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా || 2 ||
నింపాడు నీ నావ అద్భుత రీతితో
తృప్తిపరిచె నీ బ్రతుకు గొప్ప మేళ్ళతో || 2 ||
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి || 2 ||
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి || 2 || ||ఓ నావికా||
విరిగి నలిగిన మనస్సుతో
చేసావు నీ సమరం || 2 ||
శయనించక ఎడతెగక
ఈదావు ఈ భవ సాగరం || 2 ||
అడుగడుగో యేసు వచ్చెనయ్యా
వరాలెన్నో నీకై తెచ్చెనయ్యా || 2 ||
కరుణించాడు నిన్ను చల్లని చూపుతో
నిర్మలమయ్యె బ్రతుకు యేసుని ప్రేమతో || 2 ||
వెంబడించు యేసును పూర్ణ శక్తితో
యేసే ఈ జగతికి సర్వాధికారి
యేసే నీ నావకి చూపించు దారి || 2 ||
చేస్తాడు నిన్ను అసలైన జాలరి
మనుషుల పట్టే జాలరి || 2 || ||ఓ నావికా||