ఈ జీవితం విలువైనది

I Jivitam Viluvainadi

16 Dec 2025
ఈ జీవితం విలువైనది నరులారా రండని సెలవైనది || 2 || సిద్ధపడినావా చివరి యాత్రకు యుగయుగాలు దేవునితో ఉండుటకు నీవుండుటకు ||ఈ జీవితం|| సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయేటప్పుడు ఏదీ పట్టుకొని పోవు || 2 || పోతున్నవారిని నువు చుచుటలేదా || 2 || బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా || 2 || ||ఈ జీవితం|| మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు కలకాలమీ లోకంలో ఉండే స్థిరుడెవడు || 2 || చిన్న పెద్ద తేడా లేదు మరణానికి || 2 || కులమతాలు అడ్డం కాదు స్మశానానికి || 2 || ||ఈ జీవితం|| పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పుచెందు మరణానికి ముందు || 2 || యేసు రక్తమే నీ పాపానికి మందు || 2 || కడగబడిన వారికే గొర్రెపిల్ల విందు || 2 || ||ఈ జీవితం||