ఆధారం నీవేనయ్యా
Adharam Nivenayya
S Rajasekhar
28 Oct 2025
ఆధారం నీవేనయ్యా || 2 ||
కాలం మారినా కష్టాలు తీరినా
కారణం నీవేనయ్యా
యేసయ్యా కారణం నీవేనయ్యా ||ఆధారం||
లోకంలో ఎన్నో జయాలు
చూసాను నేనింత కాలం || 2 ||
అయినను ఎందుకో నెమ్మది లేదు || 2 ||
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
ఐశ్వర్యం కొదువేమి లేదు
కుటుంబములో కలతేమి లేదు || 2 ||
అయినను ఎందుకో నెమ్మది లేదు || 2 ||
సమాధానం కొదువైనది
యేసయ్యా సమాధానం కొదువైనది ||ఆధారం||
నీ సేవకునిగా జీవింప
హృదయంలో ఉన్నకోర్కెలను || 2 ||
హృదయము నిచ్చావు నెమ్మది నొందా || 2 ||
సాక్షిగా జీవింతును
హల్లేలూయ సాక్షిగా జీవింతును ||ఆధారం||