ఆనంద యాత్ర

Ananda Yatra

Hosanna Ministries 28 Oct 2025
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర యేసుతో నూతన యెరుషలేము యాత్ర మన.. యేసుతో నూతన యెరుషలేము యాత్ర ||ఆనంద యాత్ర|| యేసుని రక్తము పాపములనుండి విడిపించెను || 2 || వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును || 2 || ||ఆనంద యాత్ర|| రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా || 2 || మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా || 2 || ||ఆనంద యాత్ర|| కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను || 2 || కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము || 2 || ||ఆనంద యాత్ర|| ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం ||ఆనంద యాత్ర||