ఆరాధించెదము ఆత్మతో నిరతము

Aradhincedamu Atmato Niratamu

28 Oct 2025
ఆరాధించెదము ఆత్మతో నిరతము యెహోవా దేవుని మనమంతా ఆనంద గానము మనసారా పాడుచు అనుదినం కీర్తింతుము రారాజును – || 2 || ||ఆరాధించెదము|| అక్షయ నాథుడు అద్వితీయుడు పరిశుద్ధ దేవుడు నిత్య నివాసియు || 2 || ఆద్యంత రహితుడు అదృశ్య రూపుడు || 2 || అమరుడై యున్నవాడు మన దేవుడు || 2 || ||ఆరాధించెదము|| సత్య స్వరూపి మహోన్నతుడు మహిమాన్వితుడు మనకును తండ్రియే || 2 || ప్రభువైన క్రీస్తుకు తండ్రియైన దేవుడు || 2 || పరమందు ఆసీనుడు పూజార్హుడు || 2 || ||ఆరాధించెదము|| సమస్తమునకు జీవాధారుడై శ్రేష్ఠ ఈవులనిడు జ్యోతిర్మయుడై || 2 || భువియందు కృప జూపు కరుణా సంపన్నుడు || 2 || యుగములకు కర్తయే శ్రీమంతుడు || 2 || ||ఆరాధించెదము||