పరిశుద్ధ పరిశుద్ధ
Parisuddha Parisuddha
07 Dec 2025
పరిశుద్ధ పరిశుద్ధ – పరిశుద్ధ ప్రభువా || 2 ||
వరదూతలైనా నిన్ – వర్ణింప గలరా
వరదూతలైనా నిన్ || 3 || వర్ణింప గలరా
పరిశుద్ధ జనకుడ – పరమాత్మ రూపుడ || 2 ||
నిరుపమ బలబుద్ధి – నీతి ప్రభావా
నిరుపమ బలబుద్ధి || 3 || నీతి ప్రభావా
పరిశుద్ధ తనయుడ – నర రూప ధారుడ || 2 ||
నరులను రక్షించు – కరుణా నముద్రా
నరులను రక్షించు || 3 || కరుణా నముద్రా
పరిశుద్ధ మగు నాత్మ – వరము లిడు నాత్మ || 2 ||
పరమానంద ప్రేమ – భక్తుల కిడుమా
పరమానంద ప్రేమ || 3 || భక్తుల కిడుమా
జనక కుమారాత్మ – లను నేక దేవ || 2 ||
ఘన మహిమ చెల్లును – దనర నిత్యముగా
ఘన మహిమ చెల్లును || 3 || దనర నిత్యముగా