సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
Sarvanga Sundara Sadguna Sekhara
Bro Yesanaa Garu
16 Dec 2025
సర్వాంగ సుందరా సద్గుణ శేఖరా
యేసయ్యా నిన్ను సీయోనులో చూచెదా
పరవశించి పాడుతూ పరవళ్ళు త్రొక్కెదా || 2 ||
నా ప్రార్థన ఆలకించువాడా
నా కన్నీరు తుడుచువాడా || 2 ||
నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై
నాకు తోడై నిలిచితివా || 2 || ||సర్వాంగ||
నా శాపములు బాపినావా
నా ఆశ్రయ పురమైతివా || 2 ||
నా నిందలన్నిటిలో యెహోషాపాతువై
నాకు న్యాయము తీర్చితివా || 2 || ||సర్వాంగ||
నా అక్కరలు తీర్చినావా
నీ రెక్కల నీడకు చేర్చినావా || 2 ||
నా అపజయాలన్నిటిలో యెహోవ నిస్సివై
నాకు జయ ధ్వజమైతివా || 2 || ||సర్వాంగ||