ఎంత దూరమైనా అది
Enta Duramaina Adi
K Rajababu
27 Nov 2025
ఎంత దూరమైనా అది ఎంత భారమైనా || 2 ||
యేసు వైపు చూడు నీ భారమంత తీరు || 2 ||
తీరానికి చేరు || 2 || ||ఎంత||
నడచి నడచి అలసిపోయినావా
నడువలేక సొమ్మసిల్లి నిలిచిపోయినావా || 2 ||
కలువరి గిరి దనుక సిలువ మోసిన
నజరేయుడేసు నీ ముందు నడవగా || 2 || ||యేసు||
తెలిసి తెలిసి జారిపోయినావా
తెలియరాని చీకటిలో చిక్కుబడినావా || 2 ||
నిశీధీలో ప్రకాశించు చిరంజీవుడే
పరంజ్యోతి యేసు నీ ముందు నడువగా || 2 || ||యేసు||