ఎంత మంచి దేవుడవేసయ్యా
Enta Manci Devudavesayya
27 Nov 2025
ఎంత మంచి దేవుడవయ్యా
ఎంత మంచి దేవుడవేసయ్యా
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా
ఎంత మంచి దేవుడవేసయ్యా || 2 || ||ఎంత||
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా || 2 ||
నీ ప్రేమతో నను క్షమియించి
నను హత్తుకొన్నావయ్యా || 2 || ||ఎంత||
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ || 2 ||
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ
నను నీవు విడువలేదయ్యా || 2 || ||ఎంత||
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా || 2 ||
నీతో కూడా ఈ లోకం నుండీ
పరలోకం చేరెదనేసయ్యా || 2 || ||ఎంత||