నన్ను గన్నయ్య రావె నా యేసు

Nannu Gannayya Rave Na Yesu

Purushotham Chaudhary 22 Nov 2025
నన్ను గన్నయ్య రావె నా యేసు నన్ను గన్నయ్య రావె నా ప్రభువా ||నన్ను|| ముందు నీ పాదారవిందము లందు నిశ్చల భక్తి ప్రేమను || 2 || పొందికగా జేయరావే నా డెందమానంద మనంతమైయుప్పొంగ ||నన్ను|| హద్దులేనట్టి దురాశల నవివేకినై కూడి యాడితి || 2 || మొద్దులతో నింక కూటమి వద్దయ్య వద్దయ్య వద్దయ్య తండ్రి ||నన్ను|| కాలము పెక్కు గతించెను గర్వాదు లెడదెగవాయెను || 2 || ఈ లోకమాయ సుఖేచ్ఛలు చాలును జాలును జాలు నోతండ్రి ||నన్ను|| దారుణ సంసార వారధి దరి జూపి ప్రోవ నీ కన్నను || 2 || కారణ గురువు లింకెవ్వరు లేరయ్య – లేరయ్య లేరయ్య తండ్రి ||నన్ను|| నా వంటి దుష్కర్మ జీవిని కేవలమగు నీదు పేర్మిని || 2 || దీవించి రక్షింపనిప్పుడే రావయ్య రావయ్య రావయ్య తండ్రి ||నన్ను||