నా ప్రాణ ప్రియుడా

Na Prana Priyuda

05 Dec 2025
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా నను గన్న తండ్రి నా యేసయ్యా పూజింతును ఓ పూజార్హుడా భజియింతును ఓ భవదీయుడా నీవు గాక ఎవ్వరు నాకు లేరయ్యా || 2 || నీవే నీవే నా ప్రాణము నీవే నీవే నా సర్వము ||నా ప్రాణ|| ఒంటరినై తోడులేక దూరమైతిని ఓదార్చే వారు లేక భారమైతిని || 2 || తండ్రీ… నీ తోడు లేక మోడునైతిని || 2 || నీ తోడు దొరికాక చిగురించితిని || 2 || ||నీవు గాక|| శత్రువుల చేతులలో చిక్కుకొంటిని సూటిపోటి మాటలకు నలిగిపోతిని || 2 || తండ్రీ… నీ వైపు నేను చూసిన క్షణమే కష్టమంతయు తీరిపోయెను బాధలన్నియు తొలగిపోయెను ||నీవు గాక|| క్షణమైన నీ నామం మరువకుంటిని మరణమైన మధురంగా ఎంచుకుంటిని || 2 || తండ్రీ… నీవున్నావని బ్రతుకుచుంటిని || 2 || నా కొరకు నీవు నీ కొరకు నేను || 2 || ||నీవు గాక||