అడగక ముందే అక్కరలెరిగి

Adagaka Munde Akkaralerigi

Guntur Raja 03 Dec 2025
అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా మరి మరి నే చాటుకోనా మనసంతా పులకించని సాక్షిగా నా జీవిత గమనానికి గమ్యము నీవే చితికిన నా గుండెకు ప్రాణం నీవే || 2 || ||పదే పదే|| మమతల మహా రాజా (నా) యేసు రాజా || 4 || అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా || 2 || అవసరాలు తీర్చిన ఆత్మీయుడా బంధాలను పెంచిన భాగ్యవంతుడా || 2 || ||మమతల|| అడిగిన వేళ అక్కున చేరి అనురాగం పంచిన అమ్మవు నీవే నలిగిన వేళ నా దరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే || 2 || అనురాగం పంచిన అమ్మవు నీవే నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే || 2 || ||పదే పదే||