నా ప్రియుడు నజరేయుడు

Na Priyudu Najareyudu

16 Dec 2025
నా ప్రియుడు నజరేయుడు నా దేవుడు ఉన్నవాడు ఆనందభరితుడనై – అతని నీడలో నిత్యము నిలచి యుందును || నా ప్రియుడు || ద్రాక్షారసములకన్నా మధురము ఆ ప్రేమా… దాచునన్ను కౌగిలిలో – నా యేసు ప్రేమా… || 2 || పరిమళాల కన్నా పరవశమైనా… ప్రేమయైయున్నాడు నా దేవుడు || నా ప్రియుడు || జలరాశుల గలగలలు పోలిన ఆ స్వరము హిమమంత ధవళమును కలిగిన ఆ శిరము || 2 || అగ్నివంటి నేత్రాలు – అపరంజి పాదాలు కలిగివున్నవాడు – నా ఇమ్మానుయేలు || నా ప్రియుడు||