నేను వెళ్ళే మార్గము
Nenu Velle Margamu
Hosanna Ministries
28 Oct 2025
నేను వెళ్ళే మార్గము – నా యేసుకే తెలియును
శోధించబడిన మీదట – నేను సువర్ణమై మారెదను || 2 || ||నేను||
కడలేని కడలి తీరము – ఎడమాయె కడకు నా బ్రతుకున || 2 ||
గురిలేని తరుణాన వెరువగ – నా దరినే నిలిచేవ నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ || 2 ||
జలములలోబడి నే వెళ్లినా – అవి నా మీద పారవు || 2 ||
అగ్నిలో నేను నడచినా – జ్వాలలు నను కాల్చజాలవు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ || 2 ||
విశ్వాస నావ సాగుచు – పయనించు సమయాన నా ప్రభు || 2 ||
సాతాను సుడిగాలి రేపగా – నా యెదుటే నిలిచేవా నా ప్రభు
హల్లేలూయా హల్లేలూయా హల్లేలూయా ఆమేన్ || 2 || ||నేను||