యేసు రక్తము రక్తము రక్తము
Yesu Raktamu Raktamu Raktamu
Bro. Yesanna Garu
16 Nov 2025
యేసు రక్తము రక్తము రక్తము || 2 ||
అమూల్యమైన రక్తము
నిష్కళంకమైన రక్తము ||యేసు రక్తము||
ప్రతి ఘోర పాపమును కడుగును
మన యేసయ్య రక్తము || 2 ||
బహు దు:ఖములో మునిగెనే
చెమట రక్తముగా మారెనే || 2 || ||యేసు రక్తము||
మనస్సాక్షిని శుద్ధి చేయును
మన యేసయ్య రక్తము || 2 ||
మన శిక్షను తొలగించెను
సంహారమునే తప్పించెను || 2 || ||యేసు రక్తము||
మహా పరిశుద్ద స్థలములో చేర్చును
మన యేసయ్య రక్తము || 2 ||
మన ప్రధాన యాజకుడు
మన కంటె ముందుగా వెళ్ళెను || 2 || ||యేసు రక్తము||