నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా

Nikante Nammadagina Devudevarayya

A R Stevenson 28 Oct 2025
నీకంటె నమ్మదగిన దేవుడెవరయ్యా నీవుంటే నాతో ఏ భయము లేదయ్యా || 2 || మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా ||నీకంటె|| కొట్టబడిన వేళ నా గాయం కట్టినావే || 2 || బాధించినా స్వస్థపరిచేది నీవే || 2 || ||నీకంటె|| అణచబడిన వేళ నా తలను ఎత్తినావే || 2 || శిక్షించినా గొప్ప చేసేది నీవే || 2 || ||నీకంటె|| విడువబడిన వేళ నను చేరదీసినావే || 2 || కోపించినా కరుణ చూపేది నీవే || 2 || ||నీకంటె||