జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా

Jyotirmayuda Na Prana Priyuda

Hosanna Ministries 28 Oct 2025
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే – నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే || 2 || ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా || 2 || నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా || 2 || ||జ్యోతి|| నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి || 2 || నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా || 2 || ||జ్యోతి|| నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా || 2 || త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద || 2 || ||జ్యోతి||