ఆరాధించెదము యేసయ్య నామమును
Aradhincedamu Yesayya Namamunu
16 Nov 2025
ఆరాధించెదము యేసయ్య నామమును
పరిశుద్ధ సంఘముగా అన్ని వేళలా మేము || 2 ||
ఆరాధన ఆరాధన ఆరాధనా
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయా || 2 || ||ఆరాధించెదము||
ఆది యందు ఉన్న దేవుడు
అద్భుతాలు చేయు దేవుడు || 2 ||
అబ్రాహాము దేవుడు ఆత్మయైన దేవుడు || 2 ||
అద్వితీయ సత్య దేవుడు
యేసయ్య అద్వితీయ సత్య దేవుడు || 2 || ||ఆరాధన||
మోక్షము నిచ్చు దేవుడు
మహిమను చూపు దేవుడు || 2 ||
మోషే దేవుడు మాట్లాడే దేవుడు || 2 ||
మహిమ గల దేవుడు నిత్య దేవుడు
యేసయ్య మహిమ గల దేవుడు నిత్య దేవుడు || 2 || ||ఆరాధన||
దాహము తీర్చు దేవుడు
ధన ధాన్యములిచ్చు దేవుడు || 2 ||
దావీదుకు దేవుడు దానియేలు దేవుడు || 2 ||
ధరణిలోన గొప్ప దేవుడు
యేసయ్య ధరణిలోన గొప్ప దేవుడు || 2 || ||ఆరాధన||