దవలవర్ణుడా రత్నవర్ణుడా
Davalavarnuda Ratnavarnuda
Praveen Kumar
28 Oct 2025
దవలవర్ణుడా రత్నవర్ణుడా
పదివేలలో అతిప్రియుడా
అతి కాంక్షనీయుడా || 2 ||
ఎందుకయ్యా మాపై ప్రేమ
ఎందుకయ్యా మాపై కరుణ || 2 ||
ఘోర పాపినైన నన్ను
లోకమంతా వెలివేసినా
అనాథగా ఉన్న నన్ను
ఆప్తులంతా దూషించగా || 2 ||
నీ ప్రేమ నన్నాదుకొని
నీ కరుణ నన్నోదార్చెను || 2 ||
గాయములతో ఉన్న నన్ను
స్నేహితులే గాయపరచగా
రక్తములో ఉన్న నన్ను
బంధువులే వెలివేసినా || 2 ||
నీ రక్తములో నను కడిగి
నీ స్వారూపము నాకిచ్చితివా || 2 ||
అర్హత లేని నన్ను నీవు
అర్హునిగా చేసితివి
నీ మహిమలో నిలబెట్టుటకు
నిర్దోషిగా చేసితివి || 2 ||
నీ సేవలో నను వాడుకొని
నీ నిత్య రాజ్యము చేర్చితివి || 2 || ||దవలవర్ణుడా||