కొంతసేపు కనబడి

Kontasepu Kanabadi

A R Stevenson 31 Dec 2025
కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదిరా ఈ జీవితం లోకాన కాదేది శాశ్వతం || 2 || యేసే నిజ దేవుడు నిత్యజీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు || 2 || ||కొంతసేపు|| ఎదురౌతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో || 2 || వచ్చేదెవరు నీతో మరణము వరకు || 2 || ఇచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు ||యేసే|| చెమటోడ్చి సుఖము విడిచి కష్టమునోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా || 2 || ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే || 2 || సంపాదన ఎవరిదగును యోచించితివా ||యేసే|| నీ శాపం తాను మోసి పాపం తీసి రక్షణ భాగ్యము నీకై సిద్ధము చేసి || 2 || విశ్రాంతినీయగ నిన్ను పిలువగా || 2 || నిర్లక్ష్యము చేసిన తప్పించుకొందువా ||యేసే||