ఆగదు నా పయనం
Agadu Na Payanam
Pst. T. Jafanya Sastry
16 Nov 2025
ఆగదు నా పయనం – సీయోను చేరకుండా
ఆశలు కోరికలు – వెనకకు లాగిననూ
నా గమ్యము చేర – సాగిపోయెదనూ
ఎల్షద్దాయ్ బలమియ్యగా
మరి లోతుగా వేరు తన్నెదను
మరి క్రిందికి వేరు తన్నెదను
అదొనాయ్ తోడుండగా
పైకెదిగీ ఫలియించెదన్ || ఎల్షద్దాయ్ ||
ఐగుప్తు ద్రాక్షను ప్రేమతో తెచ్చి
శ్రేష్ట స్థలమున లోతుగా నాటి
సంద్రము వరకు వ్యాపింపజేసి
కొండలే ఎక్కించినావే || 2 ||
నీ చేతి కొమ్మనూ – నీ నీడలో కాయుమా || ఎల్షద్దాయ్ ||
గుండె కడవను పాలతో నింపి
ఎముకల్లోనా మూలుగు పెంచి
ఎత్తైన కొండ ఎక్కే బలమును
కృపతో నాకిచ్చావే || 2 ||
నీ చేతి భోజనమే – ఈ శక్తి నాకిచ్చెనూ || ఎల్షద్దాయ్ ||
ఎగిరే రెక్కలు నాకిచ్చినా గాని
నా గాయాల్లోనే దాగుందునూ
సింహాన్నే చంపే బలమిచ్చినా
నీ చాటునే బ్రతికెదనూ || 2 ||
బలమూ నీదే కదా – కృపయూ నీదే కదా || ఎల్షద్దాయ్ ||