యేసయ్య కనికరపూర్ణుడా
Yesayya Kanikarapurnuda
Bro. Yesanna Garu
16 Nov 2025
యేసయ్య కనికరపూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా
నీవేనా సంతోషగానమూ సర్వసంపదలకు ఆధారము
నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి
నను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడిచితివి || 2 ||
సిలువ మానుపై రక్తము కార్చి రక్షించితివి
శాశ్వత కృపపొంది జీవింతును ఇల నీ కొరకే || యేసయ్య ||
నా కొరకు సర్వము ధారాళముగా దయచేయు వాడవు
దహయు తీర్చుటకు బండను చీల్చిన ఉపకారివి || 2 ||
ఆలసిన వారి ఆశను తృప్తి పరచితివి
అనంత కృప పొంది ఆరాధింతును అనుక్షణము || యేసయ్య ||
నీ వలన బలము నొందిన వారే ధన్యులు నీ సన్నిధియైన
సీయెనులో వారు నిలిచెదరు || 2 ||
నిలువరమైన రాజ్యములో నిను చుచుటకు
నిత్యము కృప పొంది సేవించెదను తుదివరకు || యేసయ్య ||
ఆరాధనకు యోగ్యుడవు .. ఎల్లవేళలా పూజ్యుడవు ..