యేసయ్యా నా హృదయ స్పందన

Yesayya Na Hrdaya Spandana

16 Nov 2025
యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా || 2 || విశ్వమంతా నీ నామము ఘణనీయము || 2 || ||యేసయ్యా|| నీవు కనిపించని రోజున ఒక క్షణమొక యుగముగా మారెనే || 2 || నీవు నడిపించిన రోజున యుగయుగాల తలపు మది నిండెనే || 2 || యుగయుగాల తలపు మది నిండెనే ||యేసయ్యా|| నీవు మాట్లాడని రోజున నా కనులకు నిద్దుర కరువాయెనే || 2 || నీవు పెదవిప్పిన రోజున నీ సన్నిధి పచ్చిక బయలాయెనే || 2 || నీ సన్నిధి పచ్చిక బయలాయెనే ||యేసయ్యా|| నీవు వరునిగా విచ్చేయి వేళ నా తలపుల పంట పండునే || 2 || వధువునై నేను నిను చేరగా యుగయుగాలు నన్నేలు కొందువనే || 2 || యుగయుగాలు నన్నేలు కొందువనే ||యేసయ్యా||