యేసు నాథా దేవా
Yesu Natha Deva
16 Nov 2025
యేసు నాథా దేవా
వందనాలు రాజా.. వందనాలు
రాజాధి రాజా నీకే వందనాలు
రవి కోటి తేజా నీకే వందనాలు || 2 || ||యేసు నాథా||
పాపిని కరుణించి ప్రాణ దానమిచ్చావు
పరమ జీవమిచ్చి పరలోక రాజ్యమిచ్చి || 2 ||
పన్నెండు గుమ్మముల…
పట్టణమే నాకు కట్టిపెట్టినావా ||రాజాధి రాజా||
నీచుని ప్రేమించి నీ ప్రాణమిచ్చావు
నీ నీతి నాకిచ్చి నిత్య రాజ్యమిచ్చావు || 2 ||
నీ నీతి నీ రాజ్యం…
నిండైన నా భాగ్యమే ||రాజాధి రాజా||
హీనుని దీవించి ఘనునిగా చేసావు
నీ రుధిరమే కార్చి నా ఋణము దీర్చావు || 2 ||
నా సల్లనయ్యా…
నా యన్న నీవే నా యేసయ్యా ||రాజాధి రాజా||
కన్ను మిన్ను గానకుండా నిన్ను మీరిపోయాను
చిన్నబుచ్చుకోకుండా నన్ను సమకూర్చావు || 2 ||
నీ మనసే వెన్నయ్యా…
నా కన్న తండ్రి నా యేసయ్యా ||రాజాధి రాజా||