ఎంత పెద్ద పోరాటమో
Enta Pedda Poratamo
Prasanna Benhur
28 Oct 2025
ఎంత పెద్ద పోరాటమో
అంత పెద్ద విజయమో || 2 ||
పోరాడతాను నిత్యము
విజయమనేది తథ్యము || 2 ||
వాక్యమనే ఖడ్గమును ఎత్తి పట్టి
విశ్వాసమనే డాలుని చేత పట్టి || 2 ||
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవాదే యుద్ధమనుచు || 2 || ||ఎంత||
ప్రార్థన యుద్ధములో కనిపెట్టి
సాతాను తంత్రములు తొక్కి పెట్టి || 2 ||
ముందుకే దూసుకెళ్లెదన్
యెహోవా నిస్సీ అనుచు || 2 || ||ఎంత||
యేసు కాడిని భుజమున పెట్టి
వాగ్ధాన తలుపు విసుగక తట్టి || 2 ||
ముందుకే దూసుకెళ్లెదన్
సిలువలో సమాప్తమైనదనుచు || 2 || ||ఎంత||