నా గీతారాధనలో యేసయ్యా
Na Gitaradhanalo Yesayya
Bro. Yesanna Garu
16 Nov 2025
నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే
నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ – || 2 || ||నా గీతా||
నీ కృప నాలో వ్యర్ధము కాలేదు – నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో – మొలవనివ్వలేదులే || 2 ||
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే || 2 || ||నా గీతా||
చేనిలోని పైరు చేతికి రాకున్నా – ఫలములన్ని రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా – నేను చలించనులే || 2 ||
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే || 2 || ||నా గీతా||
ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో – నిండుగా కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో – ఫలింపజేసెనే || 2 ||
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై || 2 || ||నా గీతా||