యెహోవా నా బలమా
Yehova Na Balama
16 Nov 2025
యెహోవా నా బలమా
యదార్థమైనది నీ మార్గం
పరిపూర్ణమైనది నీ మార్గం || 2 || ||యెహోవా||
నా శత్రువులు నను చుట్టిననూ
నరకపు పాశములరికట్టిననూ || 2 ||
వరదవలె భక్తిహీనులు పొర్లిన || 2 ||
విడువక నను ఎడబాయని దేవా || 2 || ||యెహోవా||
మరణపుటురులలో మరువక మొరలిడ
ఉన్నతదుర్గమై రక్షనశృంగమై || 2 ||
తన ఆలయములో నా మొఱ్ఱ వినెను || 2 ||
ఆదరెను ధరణి భయకంపముచే || 2 || ||యెహోవా||
నా దీపమును వెలిగించువాడు
నా చీకటిని వెలుగుగా చేయును || 2 ||
జలరాసులనుండి బలమైన చేతితో || 2 ||
వెలుపల చేర్చిన బలమైన దేవుడు || 2 || ||యెహోవా||
పౌరుషముగల ప్రభు కొపింపగా
పర్వతముల పునాదులు వణకెను || 2 ||
తన నోటనుండి వచ్చిన అగ్ని || 2 ||
దహించివేసెను వైరులనెల్లన్ || 2 || ||యెహోవా||
మేఘములపై ఆయన వచ్చును
మేఘములను తన మాటుగ జేయును || 2 ||
ఉరుముల మెరుపుల మెండుగ జేసి || 2 ||
అపజయమిచ్చును అపవాదికిని || 2 || ||యెహోవా||
దయగలవారిపై దయ చూపించును
కఠినులయెడల వికటము జూపును || 2 ||
గర్విష్టుల యొక్క గర్వమునణుచును || 2 ||
సర్వమునెరిగిన సర్వాధికారి || 2 || ||యెహోవా||
నా కాళ్ళను లేడి కాళ్లుగా జేయును
ఎత్తైన స్థలములో శక్తితో నిలిపి || 2 ||
రక్షణ కేడెము నాకందించి || 2 ||
అక్షయముగ తన పక్షము జేర్చిన || 2 || ||యెహోవా||
యెహోవా జీవముగల దేవా
బహుగా స్తుతులకు అర్హుడ నీవే || 2 ||
అన్యజనులలో ధన్యత చూపుచు || 2 ||
హల్లెలూయ స్తుతిగానము చేసెద || 2 || ||యెహోవా||