నా ప్రాణమా నాలో నీవు
Na Pranama Nalo Nivu
Bro. Yesanna Garu
16 Nov 2025
నా ప్రాణమా నాలో నీవు
ఎందుకు కృంగియున్నావు
యెహోవాయందే ఇంకను
నిరీక్షణ ఉంచుము నీవు || 2 || ||నా ప్రాణమా||
ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ || 2 ||
నీ కొరకే బలియైన యేసు
సిలువను గూర్చి తలపోయుమా || 2 ||
అల్పకాల శ్రమల పిదప
మహిమతో నిను నింపును ప్రభు నా ప్రాణమా || 2 || ||నా ప్రాణమా||
ఆప్తులంతా నిను వీడిననూ
శత్రువులే నీపై లేచిననూ || 2 ||
తల్లి అయినా మరచినా మరచున్
నేను నిన్ను మరువాననినా || 2 ||
యేసుని ప్రేమన్ తలపోయుమా
ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా || 2 || ||నా ప్రాణమా||
ఐశ్వర్యమే లేకున్ననూ
సౌఖ్య జీవితమే కరువైననూ || 2 ||
ప్రభు సేవలో ప్రాణములనే
అర్పించవలసి వచ్చిననూ || 2 ||
క్రీస్తునికే అంకితమై ఆనందించు
ప్రభు రాకకై కనిపెట్టుమా నా ప్రాణమా || 2 || ||నా ప్రాణమా||