మనసెరిగిన యేసయ్యా

Manaserigina Yesayya

Bro. Yesanna Garu 16 Nov 2025
మనసెరిగిన యేసయ్యా మదిలోన జతగా నిలిచావు || 2 || హృదయాన నీ ఆజ్ఞలు వ్రాసి నీ పత్రికనుగా మార్చావు || 2 || ||మనసెరిగిన|| నిర్జీవ క్రియలను విడిచి పరిపూర్ణ పరిశుద్ధతకై సాగిపోదును నేను ఆగిపోలేనుగా || 2 || సాహసక్రియలు చేయు నీ హస్తముతో నన్ను పట్టుకొంటివే విడువలేవు ఎన్నడు || 2 || ||మనసెరిగిన|| వెనకున్న వాటిని మరచి నీ తోడు నేను కోరి ఆత్మీయ యాత్రలో నేను సొమ్మసిల్లి పోనుగా || 2 || ఆశ్ఛర్యక్రియలు చేయు దక్షిణ హస్తముతో నన్ను ఆదుకొంటివే ఎడబాయవు ఎన్నడు || 2 || ||మనసెరిగిన|| మర్త్యమైన దేహము వదిలి అమర్త్యతను పొందుటకై ప్రభు బల్లారాధనకు దూరము కాలేనుగా || 2 || నేలమంటితో నన్ను రూపించిన హస్తములే నన్ను కౌగిలించెనే వదలలేవు ఎన్నడు || 2 || ||మనసెరిగిన||