అన్ని నామముల కన్న ఘనమైన

Anni Namamula Kanna Ghanamaina

B Esther Rani 28 Oct 2025
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా అందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథా యెహోవ ఈరే అని పిలువబడినవాడ || 2 || నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు || 2 || ||అన్ని నామముల|| దేవతలకన్నా దయగలవాడవు క్షమించు మనసున్న మహారాజువు || 2 || ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవు ప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల|| గాలి తుఫానులను ఆపినవాడవు నీటిపై నడచిన నిజ దేవుడవు || 2 || జానతో ఆకాశాన్ని కొలిచినవాడవు శాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||