స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
Stutipatruda Stotrarhuda
Bro. Yesanna Garu
16 Nov 2025
స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా
స్తుతులందుకో పూజార్హుడా || 2 ||
ఆకాశమందు నీవు తప్ప
నాకెవరున్నారు నా ప్రభు || 2 || ||స్తుతి||
నా శత్రువులు నను తరుముచుండగా
నా యాత్మ నాలో కృంగెనే ప్రభు || 2 ||
నా మనస్సు నీవైపు – త్రిప్పిన వెంటనే
శత్రువుల చేతినుండి విడిపించినావు
కాపాడినావు || 2 || ||స్తుతి||
నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి
దూరాన నిలిచేరు నా ప్రభూ || 2 ||
నీ వాక్య ధ్యానమే – నా త్రోవకు వెలుగై
నను నిల్పెను నీ సన్నిధిలో
నీ సంఘములో || 2 || ||స్తుతి||