యెహోవాను సన్నుతించెదన్

Yehovanu Sannutincedan

P Satish Kumar 16 Nov 2025
యెహోవాను సన్నుతించెదన్ ఆయనను కీర్తించెదను ప్రభువును ఘనపరచెదన్ ఆ నామమునే గొప్ప చేసెదన్ || 2 || హల్లెలూయా హల్లెలూయా || 2 || ||యెహోవాను|| నాకున్న సర్వము నన్ను విడచినను నావారే నన్ను విడచి నిందలేసినను || 2 || నా యేసయ్యను చేరగా నేనున్నానన్నాడుగా || 2 || ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును || 2 || ||యెహోవాను|| నాకున్న భయములే నన్ను కృంగదీయాగా నా హృదయం నాలోనే నలిగిపోయేగా || 2 || నా యేసయ్యను చేరగా నన్నాదరించెనుగా || 2 || ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును || 2 || ||యెహోవాను|| నా ఆశలే నిరాశలై నిస్పృహలో ఉండగా నాపైన చీకటియే నాన్నవరించెగా || 2 || నా దీపము ఆరుచుండగా నా యేసయ్య వెలిగించెగా || 2 || ఆయనకే స్తుతి ఆయనకే కీర్తి యుగయుగములు చెల్లును || 2 || ||యెహోవాను||