నా దీపము యేసయ్యా
Na Dipamu Yesayya
Bro. Yesanna Garu
16 Nov 2025
నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు
సుడిగాలిలోనైనా జడి వానలోనైనా
ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము
నీవు వెలిగించిన దీపము – || 2 ||
ఆరని దీపమై దేదీప్యమానమై
నా హృదయ కోవెలపై దీపాల తోరణమై || 2 ||
చేసావు పండుగ వెలిగావు నిండుగా || 2 || ||నా దీపము||
మారని నీ కృప నను వీడనన్నది
మర్మాల బడిలోన సేదదీర్చుచున్నది || 2 ||
మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా || 2 || ||నా దీపము||
ఆగని హోరులో ఆరిన నేలపై
నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై || 2 ||
పరాక్రమ శాలివై నడిచావు కాపరిగా || 2 || ||నా దీపము||