మన్నేగదయ్యా మన్నేగదయ్యా

Mannegadayya Mannegadayya

16 Nov 2025
మన్నేగదయ్యా మన్నేగదయ్యా || 2 || మహిలోని ఆత్మ జ్యోతియు తప్ప మహిలోనిదంతా మన్నేగదయ్యా || 2 || ||మన్నేగదయ్యా|| మంచిదంచు ఒకని యించు సంచిలోనే ఉంచినా మించిన బంగారము మించిన నీ దేహము || 2 || ఉంచుము ఎన్నాళ్ళకుండునో మరణించగానే మన్నేగదయ్యా || 2 || ||మన్నేగదయ్యా|| ఎన్ని నాళ్ళు లోకమందు ఉన్నతముగా నిలిచినా నిన్ను చూచి లోకులంతా ధన్యుడవని పిలిచినా || 2 || మెల్లని పుష్పంబు పోలినా పుష్పంబుతోనే ఊడిపడినది || 2 || ||మన్నేగదయ్యా|| మిక్కిలి సౌందర్యమగు చక్కని నీ దేహము ఒక్కనాడు ఆరిపోగా నీలో ఆత్మ దీపము || 2 || కుక్క శవంతో సమమేగా నిక్కముగనదియు మన్నేగదయ్యా || 2 || ||మన్నేగదయ్యా|| మానవునికి మరణమింత ఎంచనంత మన్నిల మరణమును జయించుచున్న కాలమింత మన్నిల || 2 || మరణ విజయుడేసు క్రీస్తుడే మది నమ్ము నిత్య జీవమిచ్చ్చును || 2 || ||మన్నేగదయ్యా||