ఆకాశ వాసులారా
Akasa Vasulara
Andhra Kraisthava Keerthanalu
28 Oct 2025
ఆకాశ వాసులారా
యెహోవాను స్తుతియించుడి || 2 ||
ఉన్నత స్థలముల నివాసులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ||
ఆయన దూతలారా మరియు
ఆయన సైన్యములారా || 2 ||
సూర్య చంద్ర తారలారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ||
సమస్త భుజనులారా మరియు
జనముల అధిపతులారా || 2 ||
వృద్దులు బాలురు, యవ్వనులారా
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ||
క్రీస్తుకు సాక్షులారా మరియు
రక్షణ సైనికులారా || 2 ||
యేసు క్రీస్తు పావన నామం
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ || 2 || ||ఆకాశ||