స్తోత్రబలి స్తోత్రబలి
Stotrabali Stotrabali
S J Berchmans
17 Nov 2025
స్తోత్రబలి స్తోత్రబలి – మంచిదేవా నీకేనయ్యా
శుభవేళ ఆనందమే – నా తండ్రి నీ చిరుపాదమే || 2 ||
నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే || 2 ||
నెమ్మది ఉదయించె అది శాశ్వతమైనదయ్యా || 2 ||
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
రేయంతా కాచితివి మరు దినమిచ్చితివి || 2 ||
మరువని నా స్నేహమా నీతో కలసి సంతోషింతును || 2 ||
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
నీ సేవ మార్గంలో ఉత్సాహం నొసగితివి || 2 ||
ఉరికురికి పనిచేయ నాకు ఆరోగ్యమిచ్చితివి || 2 ||
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||
వేదన దుఃఖమైన ఎన్నడు విడదీయదు || 2 ||
యేసయ్య నీ నీడలో దినదినం జీవింతును || 2 ||
కోటి కోటి స్తోత్రం డాడి (3) ||స్తోత్రబలి||