అదిగో నా నావ బయలు దేరుచున్నది
Adigo Na Nava Bayalu Derucunnadi
28 Oct 2025
అదిగో నా నావ బయలు దేరుచున్నది
అందులో యేసు ఉన్నాడు
నా నావలో క్రీస్తు ఉన్నాడు || 2 ||
వరదలెన్ని వచ్చినా వణకను
అలలెన్ని వచ్చినా అదరను || 2 ||
ఆగిపోయే అడ్డులొచ్చినా
సాగిపోయే సహాయం మనకు ఆయనే || 2 || ||అదిగో||
నడిరాత్రి జాములో నడచినా
నది సముద్ర మధ్యలో నిలచినా || 2 ||
నడిపించును నా యేసు
నన్నూ అద్దరికి చేర్చును || 2 || ||అదిగో||
లోతైన దారిలో పోవుచున్నది
సుడిగుండాలెన్నో తిరుగుచున్నవి || 2 ||
సూర్యుడైన ఆగిపోవును
చుక్కాని మాత్రం సాగిపోవును || 2 || ||అదిగో||